మహిళలు ఏడాదికి ఒకసారైనా చేయించుకోవాల్సిన 12 రకాల రక్త పరీక్షలు ఇవే..
హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/03 సెప్టెంబర్: మహిళలు సంవత్సరానికి ఒకసారైనా 12 రక్త పరీక్షలు చేయించుకోవాలని న్యూట్రిషనిస్ట్ ఖుష్బూ జైన్ సూచించారు. కంప్లీట్ బ్లడ్ కౌంట్, విటమిన్ బీ12, విటమిన్ డీ, థైరాయిడ్ ప్యానెల్, HbA1c, ఐరన్ స్టేటస్, లిపిడ్ ప్యానెల్, హార్మోన్ ప్యానెల్, ఫాస్టింగ్ ఇన్సులిన్, కాల్షియం, HS CRP, హోమోసిస్టీన్ ఈ జాబితాలో ఉన్నాయి. స్త్రీలలో చాలా ఆరోగ్య సమస్యలు త్వరగా బయటపడవని, ఈ పరీక్షలతో అలాంటి వాటిని తెలుసుకోవచ్చని జైన్ చెప్పారు.