వాళ్లను కాపాడేందుకు రాత్రంతా సహాయక చర్యలు..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/03 సెప్టెంబర్: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్ సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న దుందుభి వాగులో పదిమంది వ్యక్తులు చిక్కుకున్నారు. వాగులో చిక్కుకున్న వారిని రాత్రి నుంచి కాపాడేందుకు అచ్చంపేట దేవరకొండ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి డ్రోన్ ద్వారా పోలీసులు భోజనం పంపించారు. రాత్రంతా సహాయక చర్యల్లో నిమగ్నమైన పోలీసులు సంబంధిత సిబ్బంది. తాళ్ల సహాయంతో నలుగురిని బయటికి తీసుకొచ్చిన రిస్క్యూటీం మరో ఆరుగురిని కాపాడేందుకు రిస్క్యూ టీం, పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.