హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/03 సెప్టెంబర్: భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో ఆయా జిల్లాల్లో పరిస్థితుల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవులపై జిల్లా కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మహబూబాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఖమ్మం జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటించారు