వినాయక చవితి ఏ రోజు జరుపుకోవాలి?

Get real time updates directly on you device, subscribe now.

వినాయక చవితి రోజు ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

వినాయక చవితి ఏ రోజు జరుపుకోవాలి?

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/02 సెప్టెంబర్: భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి రోజు వినాయక చవితి జరపుకుంటారు. అయితే ఈ ఏడాది చతుర్థి తిథి సెప్టెంబర్ 6న మధ్యాహ్నం 3.01 నుంచి సెప్టెంబర్ 7న సాయంత్రం 5.37 వరకు ఉంది. ఉదయం తిథి ప్రకారం వినాయక చవితి సెప్టెంబర్ 7న శనివారం జరపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ రోజున వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి ఉపవాసం చేస్తారు.

వినాయక చవితి రోజు ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

సెప్టెంబర్ 7న వినాయక చవితి పండుగ. ఆ రోజున కొన్ని పనులు చేయొద్దని పండితులు చెబుతున్నారు.

1. తులసి దళాలు: బొజ్జ గణపయ్య పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు. తులసిని వినాయకుడు శపించాడని పురణాలు చెబుతున్నాయి.
2. చంద్రుడు: శివుడి శిగలో ఉండే చంద్రుడు ఒకసారి వినాయకుడి గజర రూపాన్ని వెక్కిరించాడని ఆ రోజున చంద్రుడిని చూస్తే కష్టాలు పడతారని నమ్మకం.
3. వెండి పాత్రలు: గణేశుడి పూజలో వెండి పాత్రలు, తెల్లటి వస్తువులను ఎప్పుడూ ఉపయోగించకూడదు.
4. విరిగిన బియ్యం: వినాయకుని పూజలో విరిగిన బియ్యాన్ని సమర్పించకూడదు.
5. మొగలి పువ్వులు: శివుడు మొగలి పువ్వుని శపింస్తాడని పురాణాలు చెబుతున్నాయి. వినాయకుని పూజలో వీటిని ఉపయోగించరాదు.
6. ఎండిన పువ్వులు: వినాయకుని పూజలో పొర పాటున కూడా ఎండిన లేదా వాడిన పువ్వులను సమర్పించవద్దు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment