సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ ఫోన్!
అప్రమత్తంగా ఉండాలని సూచన
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/02 సెప్టెంబర్: తెలంగాణలో వరద తీవ్రత ఎలా ఉందంటూ ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసి రాష్ట్ర స్థితిగతులను ఆరా తీశారు. రాష్ట్రంలో వరద పరిస్థితులు, జరిగిన నష్టాన్ని ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం, వరదలతో వాటిళ్లిన అపార నష్టాన్ని ప్రధాని దృష్టికి సీఎం రేవంత్ తీసికెళ్లారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తక్షణ సహాయక చర్యలను, తీసుకున్న జాగ్రత్తలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోడీకి వివరించారు.
ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించినట్లుగా ప్రధానికి వివరించారు. ఈ సందర్భంగా ముందస్తు చర్యలతో ప్రాణనష్టం సంభవించకుండా అప్రమత్తంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని మోడీ అభినందించారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలందించే హెలీకాఫ్టర్లను పంపిస్తామని ప్రధాని మోడీ హామీనిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరపున అవరసమైన వరద సహాయక చర్యలను చేపట్టనున్నట్లు ప్రధాని మోడీ స్పష్టం చేశారు.