సాగర్ 26 గేట్లు ఎత్తివేత?

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/నల్లగొండ జిల్లా/ 01 సెప్టెంబర్: నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయానికి రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండుకుండ లా తలపిస్తుండడంతో అక్కడి ప్రాజెక్టు అన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

దీంతో సాగర్ జలాశయానికి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుతం 588.90 అడుగులకు చేరింది.

దీనితో సాగర్ డ్యామ్ అధికారులు అప్రమత్తమై సాగర్ 26 క్రస్టుగేట్లు 14 గేట్లు 10 అడుగులమేర, 12 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి 5,00,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

2019 లో సాగర్జలాశయానికి 7,50,000 క్యూసెక్కుల గరిష్ట స్థాయిలో వరద నీరు రాగ 5 సంవత్సరాల తరువాత ఇప్పుడు 2024 లో 5,00,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. గంట, గంటకు వరద ఉదృక్తి పెరుగుతుండడంతో డ్యామ్ అధికారులు అడుగులు పెంచుతూ, సాగర్ జలాశయం నుండి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

సాగర్ ప్రాంత రైతులను, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సాగర్ దిగువ ప్రాంతంలోని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని రెవెన్యూశాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు.

జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుంగా భద్రత చర్యలు చేపడుతూ స్థానిక అధికారులను 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీచేశారు. అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజలకు ఏలాంటి ఇబ్బంది ఉన్న 100కు సమాచారం ఇవ్వాలని జిల్లాఎస్పీ వెల్లడించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment