నిండుకుండలా హుస్సేన్‌సాగర్..
హుస్సేన్‌సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్ 513.41 మీటర్లు కాగా, ప్రస్తుతం 513.43 మీటర్లుగా..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/01 సెప్టెంబర్:
భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. బంజారాహిల్స్, పికెట్, కూకట్పల్లి నాలా లతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో సాగర్‌కు భారీగా వరద చేరుతోంది. నీటిమట్టం ఫుల్ ట్యాంక్ లెవల్ దాటడంతో తూముల ద్వారా నీటిని మూసీలోకి వదులుతున్నారు. దీంతో మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. హుస్సేన్‌సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్ 513.41 మీటర్లు కాగా, ప్రస్తుతం 513.43 మీటర్లుగా ఉంది.