ఉప్పు అధికంగా తీసుకుంటే ప్రాణానికి ముప్పు: WHO

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/ఇంటర్నెట్ డెస్క్/01 సెప్టెంబర్: ఉప్పు అధికంగా తీసుకుంటే ప్రాణానికి ముప్పు ప్రతీ రోజు కేవలం 5 గ్రాములు మించి ఉప్పును తీసుకుంటే ప్రాణాపాయం తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధ్యయనంలో తేలింది. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల ఏటా 18.9 లక్షల మంది మరణిస్తున్నారని వెల్లడించింది. దీని వల్ల రక్తపోటు, గుండె సమస్యలు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఊబకాయం, కిడ్నీ వ్యాధులు వస్తాయి. రోజుకు 2000 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ తీసుకోవద్దని హెచ్చరించింది. ఉప్పుకు బదులుగా నిమ్మరసం, వెనిగర్, వాము, నానబెట్టిన సబ్జా గింజలను ఆహారంలో వాడుకోవాలని తెలిపింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment