హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/01 సెప్టెంబర్: జల దిగ్బంధంలో మణుగూరు ఇళ్లలోకి విష సర్పాలు
కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణం పూర్తిగా జల మయం అయింది. ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షానికి కుందరాయి నగర్, ఆదర్శనగర్, కాళీమాత ఏరియా, పైలట్ కాలనీ, వినాయక్‌నగర్, అశోక్‌నగర్, పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు స్థానికులు వాపోయారు. పలు ప్రాంతాల్లో వరద నీటితో విష సర్పాలు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు.