హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పబ్బులపై అధికారుల దాడులు
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/31 ఆగష్టు: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో శుక్రవారం అర్ధరాత్రి పబ్బులు, బార్లలో దాడులు చేశారు. తెలంగాణ నార్కొటిక్ బ్యూరో, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా 25 పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 107 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధరణ అయింది. శుక్రవారం రాత్రి 11 గంటల నుండి ఒంటి గంట వరకు తనిఖీలు కొనసాగాయి. మరోచోట గంజాయి పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ నిర్ధరణ అయింది. రంగారెడ్డి జిల్లాలోని బార్లలో మరో ముగ్గురు వ్యక్తులకు పాజిటివ్గా తేలింది. ఈ దాడులకు సంబంధించి తెలంగాణ నార్కొటిక్ బ్యూరో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.