హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/31 ఆగష్టు: తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది రూ.5వేల కోట్లతో 30 ప్రాంతాల్లో 120 గురుకుల పాఠశాల భవనాలు నిర్మించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సమీకృత గురుకుల సముదాయాల కోసం నియోజకవర్గాల్లో స్థలాలు, డిజైన్ల ఎంపిక వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో 15 నుంచి 25 ఎకరాలు, పట్టణాల్లో 10 నుంచి 15 ఎకరాల భూమి సేకరించాలన్నారు.