నేరుగా మొబైల్ ఫోన్లకే ట్రాఫిక్ చలాన్లు!

Get real time updates directly on you device, subscribe now.

ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే నేరుగా మొబైల్ కు చలానాలు..

నూతన వ్యవస్థ ఏర్పాటు దిశగా రవాణా శాఖ యోచన..

పైలట్ ప్రాజెక్టుగా తొలుత నగరాల్లో ఏర్పాటుకు రవాణా శాఖ ప్రతిపాదనలు..

హ్యూమన్ రైట్స్ టుడే/ఇంటర్నెట్ డెస్క్/31 ఆగష్టు: వాహన చోదకులు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే ఇప్పటి వరకూ ఆ వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చలనా (జరిమానా) వేస్తున్నారు.

అయితే వాహనదారులు చెక్ చేసుకుంటేనో లేక ఎక్కడైనా వాహనాల తనిఖీ సమయంలో పోలీసులు నిలుపుదల చేసిన సమయంలో ఎన్ని చెలాన్లు పెండింగ్ లో ఉన్నాయో ఎంత చెల్లించాలో తెలిసేది. తమ వాహనం పై ఎన్ని చెలాన్లు ఉన్నాయో తెలియక పోవడంతో వాహనదారులు వాటిని చెల్లించడం లేదు. దీంతో చెలాన్ల సంఖ్య భారీగా పెరిగిపోతూ ఉంది.

ఈ నేపథ్యంలో రవాణా శాఖ చలనాల చెల్లింపులకు కొత్త ప్రతిపాదన సిద్దం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ట్రాఫిక్ నియమాలు అతిక్రమించిన సందర్భంలో నేరుగా వాహనదారుడి మొబైల్ నెంబర్ కు ట్రాఫిక్ చలాన్ లు పంపించడంతో పాటు వాటిని సులభతరంగా చెల్లింపులకు కూడా గుగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ యాప్, యూపీఐ అప్షన్స్ కల్పించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారుట. వాహన దారుల చలాన్ జరిమానాలు పెద్ద ఎత్తున పెండింగ్ లో ఉండటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది.

దీంతో ఈ కొత్త వ్యవస్థను తీసుకువస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇది ప్రయోగాత్మక దశలోనే ఉంది. అయితే ఈ వ్యవస్థను ముందుగా కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని రవాణా శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. టాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వాహనదారులకు నేరుగా వాట్సాప్ లేదా మెసేజ్ రూపంలో చలానా పంపే విధానం తీసుకువస్తే వాహనదారులకు చెల్లింపులు సులభతరం అవుతాయని తద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment