వృద్ధులకు ‘ఈపీఎఫ్‌వో’ షాక్‌

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా వృద్ధాప్యంలోని ఈపీఎఫ్‌ పింఛనుదారులకు ఈపీఎఫ్‌వో షాక్‌ ఇచ్చింది. 70 ఏళ్లకు పైబడిన వయసులో వారిపై బకాయిల భారం మోపనుంది. 2014 సెప్టెంబరుకు ముందు పదవీ విరమణ చేసి, అధిక వేతనంపై అధిక పింఛను పొందుతున్న పింఛనుదారులకు ఆ అధిక పింఛనును రద్దుచేసింది. ఈపీఎస్‌లో వాస్తవిక వేతనంపై చందా చెల్లించేందుకు పింఛను పథకం సవరణకు ముందుగానే యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వని వారికి ప్రస్తుతం ఇస్తున్న అధిక పింఛను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. 2023 జనవరి నుంచి అధిక పింఛను నిలిపివేసి, ఈపీఎఫ్‌వో నిర్ణయించిన గరిష్ఠ వేతన పరిమితి ₹5,000/₹6,500పై సవరణ పింఛను నిర్ణయించి ఇవ్వనుంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment