ముకేశ్ అంబానీ ని దాటేసి తొలి స్థానంలో
హ్యూమన్ రైట్స్ టుడే/నెట్ డెస్క్/ 31 ఆగష్టు: దేశంలోనే అత్యంత సంపన్నుడు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ భారత అపర కుబేరుల జాబితాలో అగ్ర స్థానంలో నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ని దాటేసి తొలి స్థానం దక్కించుకున్నారు. ఈ ఏడాది వ్యవధిలో అదానీ సంపద ఏకంగా 95 శాతం ఎగిసి రూ.11.6 లక్షల కోట్లకు చేరింది. ఈమేరకు హురూన్ ఇండియా రిచ్ లిస్ట్‌ను వెలువరించింది. గత ఐదేళ్లుగా దేశంలో బిలియనీర్లు పెరుగుతున్నారని నివేదిక పేర్కొంది. దేశంలో మొత్తం 334 మంది బిలియనీర్లు ఉన్నారని తెలిపింది.