హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/31 ఆగష్టు: టాలీవుడ్‌లోనూ లైంగిక వేధింపులపై ప్రభుత్వం ఓ కమిటీ వేయాలని ప్రముఖ నటి సమంత పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మలయాళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కేరళలో WCC (Women in Cinema Collective) చేపడుతున్న చర్యలను ఆమె ప్రశంసించారు. టాలీవుడ్‌లో వేధింపులపై కమిటీ వేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆమె కోరారు.