హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/31 ఆగష్టు: ‘స్త్రీ ధనం’పై ఆ మహిళకే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దానిని తిరిగి అడిగే హక్కు ఆమె భర్తకు గాని, తండ్రికి గాని ఉండదని న్యాయస్థానం తెలిపింది. విడాకులు తీసుకున్న తన కూతురికి వివాహ సమయంలో ఇచ్చిన స్త్రీ ధనాన్ని ఆమె మాజీ అత్త మామలు తిరిగి ఇవ్వడం లేదంటూ తెలంగాణకు చెందిన పడాల వీరభద్రరావు వేసిన నమ్మకద్రోహం కేసును కోర్టు కొట్టివేసింది. పెళ్లి సమయంలో తల్లిదండ్రులు, బంధువులు కానుకల రూపంలో ఇచ్చే నగదు, ఆస్తులను స్త్రీ ధనంగా పరిగణిస్తారు.