హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/31 ఆగష్టు: తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దీనికితోడు మరో రుతుపవన ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. దీంతో శని, ఆది, సోమ వారాల్లో కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాాగా, శుక్రవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి.