హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/30 ఆగష్టు: రాచర్ల మండలం, అనుముల వీడు గ్రామ ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ గా విధులు నిర్వర్తిస్తున్న వి సి హెచ్ రామలింగయ్య 20వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఒంగోలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రాచర్ల మండలం అనుములవీడు గ్రామంలో ఎలక్ట్రికల్ లైన్ మాన్ గా వి సి హెచ్ రామలింగయ్య పనిచేస్తున్నారు. ఫిర్యాదిదారుని పొలంలో ట్రాన్స్ఫారం బిగించుట కొరకు ఫిర్యాదుదారుని వద్ద నుండి 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఒంగోలు ఎసిబి డిఎస్పి రెడ్ హ్యాండుగా పట్టుకొని అతని వద్ద నుండి 20వేల రూపాయలు లంచం డబ్బులు రికవరీ చేసినారు. ఏసీబీ డీఎస్పీ వి.శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ శేషు, ఎస్ఐ లు జే.బీ.ఎన్ ప్రసాద్, షేక్.మస్తాన్ షరీఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.