హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్: బీబీసీకి అగ్రరాజ్యం అమెరికా మద్దతు తెలిపింది ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తామని స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు.
ప్రజాస్వామ్య విలువలైన భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛలకు మద్దతు ఉంటుందని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని తాము బలంగా నమ్ముతున్నామని నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. కేవలం ఈ విలువల ఆధారంగానే ఇతర దేశాలతో సత్సంబంధాలు కొనసాగుతున్నాయన్న ఆయన.. ఇందుకు భారత్ మినహాయింపు కాదన్నారు. ప్రజాస్వామ్య దేశాలు ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తున్నట్లు తమ దృష్టికి వస్తే కచ్చితంగా వాటిపై నిలదీశామన్నారు. భారత్ – అమెరికా దేశాలు ప్రజాస్వామ్య దేశాలు కాబట్టి ప్రజాస్వామ్య విలువలకు భంగం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.