టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్, విచారణ కోసం కోర్టుకు తరలింపు
హ్యూమన్ రైట్స్ టుడే/నెట్ డెస్క్/29 ఆగష్టు: పోలీసు కస్టడీ నుంచి విడుదలైన టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్, విచారణ కోసం కోర్టుకు తరలింపు. టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ బుధవారం ఫ్రాన్స్‌లోని పోలీసు కస్టడీ నుండి విడుదలయ్యాడు. విచారణ కోసం అతడిని కోర్టుకు తరలించామని ప్రాసిక్యూటర్లు తెలిపారు. తన ప్రైవేట్ జెట్ లో లే బౌర్గెట్ విమానాశ్రయానికి చేరుకున్న దురోవ్ ను శనివారం పారిస్ పోలీసులు అరెస్ట్ చేశారు. టెలిగ్రామ్ ను చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలపై విచారణలో బాగంగా దురొవ్ ను అదుపులోకి తీసుకున్నారు.