గత 10 ఏళ్లలో తెలంగాణ తల్లిని తెరమరుగు చేశారని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/28 ఆగష్టు: సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం భూమిపూజ చేశారు. గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తల్లిని తెరమరుగు చేశారని ఆరోపించారు. డిసెంబర్ 9వ తేదీ రాష్ట్ర ప్రజలకు పండుగ రోజు. 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను సోనియా గాంధీ అదే రోజు నెరవేర్చారు. అదే తేదీన విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం. రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది” అని సీఎం పేర్కొన్నారు.