హ్యూమన్ రైట్స్ టుడే/స్పోర్ట్స్/28 ఆగష్టు: మొన్నటి వరకు జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ క్రీడలను ఘనంగా నిర్వహించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన పారిస్ ఇప్పుడు మరోసారి అలరించేందుకు రెడీ అవుతుంది. నేటి నుంచి ప్రారంభం కానున్న పారా ఒలింపిక్స్‌లోనే భారత్ నుంచి అత్యధికంగా 84 మంది అథ్లెట్లు పోటీలో పాల్గొననున్నారు. ప్రారంభ వేడుకల్లో పతకధారులుగా జావెలిన్ త్రోయర్ సుమిత్, మహిళా షాట్ ఫుటర్ భాగ్యశ్రీ జాదవ్ వ్యహరించనున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11:30 గంటలకు వేడుకలు మొదలవుతాయి.