గర్భం తొలగించుకునేందుకు 14 ఏళ్ల బాలికకు హైకోర్టు అనుమతి..
హ్యూమన్ రైట్స్ టుడే/ముంబయి/క్రైం/28 ఆగష్టు: అత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక గర్భం తొలగించుకునేందుకు బాంబే హైకోర్టు మంగళవారం అనుమతించింది. న్యాయమూర్తులు జస్టిస్ గడ్కరీ, జస్టిస్ నీలా గోఖలే ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. బాలికపై బంధువు ఒకరు అత్యాచారం చేశారు. ఆమె ప్రస్తుతం 26 వారాల గర్భిణి. 24 వారాల కంటే ఎక్కువ కాలం గర్భంతో ఉంటే అబార్షన్‌కు కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది మనీషా జగ్తాప్ బాధిత బాలిక హైకోర్టును ఆశ్రయించింది.