నేడు తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/28 ఆగష్టు: సిఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి భూమిపూజ చేయనున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి భూమిపూజ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ పూజా కార్యక్రమం జరగనున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో తెలియజేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. డిసెంబర్ 9న ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. వాస్తవానికి సచివాలయం బయట రాజీవ్‌ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన తరుణంలో కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు తెలంగాణ తల్లి విగ్రహానికి భూమిపూజ చేయనున్నారని సమాచారం.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment