బ్రేకింగ్ న్యూస్ …భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ..
హ్యూమన్ రైట్స్ టుడే/కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం/26 ఆగష్టు:
అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ..
పుల్లపాడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ తగిలించిన గుర్తు తెలియని వ్యక్తులు..
భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు నిరసన…
చెప్పుల దండ వేసిన ఘటనపై ఆరా తీస్తున్న పోలీసులు..
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పుల్లపాడు గ్రామానికి చేరుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్. ఈ ఘటనపై ఎంక్వయిరీ చేసి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సర్కిల్ ఇన్స్పెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించిన గ్రామస్తులు. అంబేద్కర్ విగ్రహానికి ఉన్న చెప్పుల దండను తొలగించిన పోలీసులు.
అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన గ్రామస్తులు..
హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న దళిత నాయకుడు చంద్రబాబు సంఘటనపై విచారణ చేస్తున్నారు.