నిమ్స్‌లో గురక సమస్యలకు చికిత్స

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/26 ఆగష్టు: గురక సమస్యకు చికిత్స అందించేందుకు హైదరాబాద్ నిమ్స్ లో ప్రత్యేక ల్యాబ్ సిద్ధమవుతోంది. ప్రైవేటు ఆసుపత్రులతో పోలిస్తే నాలుగో వంతు ఖర్చుతోనే ఈ సేవలందిస్తామని డైరెక్టర్ డా.బీరప్ప తెలిపారు. అధిక బరువు, ధూమపానం, మద్యపానం అలవాట్లు, శ్వాస నాళాల్లో అడ్డంకులు గురకకు దారి తీస్తాయి. దీనివల్ల కొన్నిసార్లు మెదడుకు ఆక్సిజన్ ఆగిపోయి పక్షవాతం వచ్చే ముప్పు ఉంటుంది. త్వరలో ఈ ల్యాబ్ ప్రారంభించి బాధితులపై అధ్యయనం చేసి, చికిత్స అందించనున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment