తెలుగు రాష్ట్రాల్లోనే మద్యం వినియోగం ఎక్కువ
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/26 ఆగష్టు: తెలుగు రాష్ట్రాల్లో మద్యం వినియోగం ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ విభాగం నిపెప్ తాజాగా వెల్లడించింది. తెలంగాణలో వార్షిక సగటు తలసరి వినియోగం రూ.1,623 ఉండగా ఏపీలో రూ.1,306గా ఉందని పేర్కొంది. ఆ తర్వాత స్థానాల్లో పంజాబ్ (రూ.1,245), ఛత్తీస్‌గడ్ (రూ.1,227), ఒడిశా (రూ.1,156) ఉన్నాయని వెల్లడించింది. మద్యంపై వస్తున్న ఆదాయం రాష్ట్రాలకు మూడో అతిపెద్ద ఆదాయ వనరుగా ఉందని తెలిపింది.