రేపు శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ సెలవు..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/25 ఆగష్టు: ఆగస్టు 26న శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఉండనుంది. సోమవారం (రేపటి రోజు) పబ్లిక్ హాలిడే ఇస్తున్నట్లు ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పేర్కొన్నాయి. అన్ని రకాల విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు పని చేయవు. ఏపీలో రేపు పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం సైతం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్లు ప్రకటించారు.