వెనక్కి వెళ్లిన సముద్రం..

Get real time updates directly on you device, subscribe now.

వైజాగ్ బీచ్ లో వెనక్కి వెళ్లిన సముద్రం.. తీరంలో బయటపడ్డ రాళ్లపై టూరిస్టుల సందడి..

హ్యూమన్ రైట్స్ టుడే/వైజాగ్/25 ఆగష్టు: వైజాగ్ బీచ్ లో ఎగిసిపడే అలలను చూస్తే పెద్దవాళ్లు కూడా పిల్లల్లా మారిపోతారు. సరదాగా నీళ్లల్లో ఆడుతూ సేద తీరుతారు. అదే అలలు కాస్త వెనక్కి వెళితే రోజూ నీళ్లలో మునిగి ఉండే తీరం ఇంకాస్త బయటపడితే..? అరుదుగా జరిగే ఇలాంటి సంఘటనే శనివారం సాయంత్రం వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో చోటుచేసుకుంది. సముద్రం దాదాపుగా నాలుగు వందల మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో తీరంలోని రాళ్లు బయటపడ్డాయి. బీచ్ లో సేద తీరేందుకు వచ్చిన జనం ఇది చూసి ఆశ్చర్యపోయారు. ఆపై రాళ్ల పైకి చేరి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment