తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ…!!!
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/25 ఆగష్టు: హైదరాబాద్లోని కూకట్ పల్లి, నిజాంపేట్, సికింద్రాబాద్, బేగంపేట్, బన్సీలాల్ పేట్, బాచుపల్లి, చందానగర్, మియాపూర్ తోపాటు పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి మోస్తారు వర్షం కురవడం ప్రారంభమైంది.
తెలంగాణ ఉత్తర మరియు ఈశాన్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం రాత్రి 9 గంటలకు ప్రారంభమైన వాన నెమ్మదిగా ఊపందుకుంటోంది.
మరో గంటలో మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, సిద్దిపేట జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదారాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇతర జిల్లాల్లో కూడా తేలిక పాటి వర్షాలు కురుస్తున్నాయి.