తొలుత పేర్లు.. తర్వాత కార్డులు..

Get real time updates directly on you device, subscribe now.

ప్రస్తుత కార్డుదారుల్లో అనర్హులను, మరణించినవారి వివరాలను తొలగించి కొత్త పేర్ల నమోదుకు అధికారులు కసరత్తు..

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్‌/24 ఆగష్టు: కొత్త రేషన్‌ కార్డుల జారీకి సంబంధించి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుత కార్డుదారుల్లో అనర్హులను, మరణించినవారి వివరాలను తొలగించి కొత్త పేర్ల నమోదుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త రేషన్‌కార్డుల జారీకి పూర్తి విధివిధానాలు ఖరారు కానున్నాయి. ఒక్కో సర్కిల్‌లో సుమారు 20వేల వరకు కొత్త పేర్ల నమోదుకు సంబంధించి అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త రేషన్‌ కార్డుల కోసం హైదరాబాద్‌లో 2.8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరిలో 34వేలు, రంగారెడ్డి జిల్లాలో 87వేల మంది దరఖాస్తు చేశారు.
వీరిలో అర్హులను గుర్తించి కార్డులు అందజేయడం లేదా కొత్తగా దరఖాస్తులను ఆహ్వానించి క్షేత్రస్థాయిలో సర్వే చేసి అర్హులను గుర్తించాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే కొత్త కార్డులు జారీ అయ్యే అవకాశం ఉంది. మరణించిన వారికి సంబంధించి తొలగింపులు జరిగినా కొత్త పేర్ల నమోదుకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో వారి దరఖాస్తులు కొన్నేళ్లుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. తాజాగా రేషన్‌కార్డుదారుల కేవైసీ ప్రక్రియ చేపట్టగా కార్డుదారుల్లో మరణించిన వారి వివరాలు వెల్లడయ్యాయి. కొంతమంది పదేళ్లుగా ఈ విషయం చెప్పకుండా రేషన్‌ తీసుకున్నట్టు తెలిసింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment