హ్యూమన్ రైట్స్ టుడే/ అమరావతీ: వైఎస్సార్ జిల్లా ఖాజీపేటలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ శివరామ్
కారు నుంచి భారీగా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్రహ్మంగారిమఠం మండలానికి చెందిన శివరామ్ కారు నుంచి 50 కేసుల కర్ణాటక మద్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి అక్రమంగా కర్ణాటక మద్యాన్ని బ్రహ్మంగారి మఠానికి తరలిస్తుండగా పోలీసులు ఖాజీపేట వద్ద తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కారులో ఉన్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ.25 లక్షలకు పైగా ఉంటుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.