పోస్ట్ ఆఫీస్ బంపర్ స్కీం..రూ. 333తో 17 లక్షలు మీ సొంతం!
హ్యూమన్ రైట్స్ టుడే/నెట్ డెస్క్/ఆగష్టు 23: పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీం ద్వారా రోజువారీ పొదుపు చేసినట్లైతే 10 సంవత్సరాలలో 17 లక్షల మొత్తాన్ని పొందవచ్చు. మీరు ఈ పధకంలో రోజుకు రూ.333 అంటే నెలకు రూ.10,000 పెట్టుబడి పెడితే, ఒక సంవత్సరానికి రూ.1.20 లక్షల వరకు డబ్బు పొదుపు చేసుకోవచ్చు. ఈ స్కీంలో పెట్టుబడి పెట్టిన డబ్బుకు ప్రస్తుతం వడ్డీరేటు 6.7% ఉంది. అదే పది ఏళ్ళు పెట్టుబడి పెడుతూ వస్తే 10 ఏళ్లకు రూ.12 లక్షలు, వడ్డీ రూ.5,08, 546 కలిసి రూ.17 లక్షలు పొందవచ్చు. పూర్తి వివరాల కోసం మీ సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి.