థాయ్‌లాండ్ లో ఏడుగురు పర్యాటకులతో వెళుతుండగా కుప్పకూలిన విమానం!
హ్యూమన్ రైట్స్ టుడే/డెస్క్/ఆగష్టు 22: థాయ్‌లాండ్ లో ఏడుగురు పర్యాటకులతో వెళుతుండగా కుప్ప కూలిన విమానం! థాయ్‌లాండ్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. సెస్నా 208Bగ్రాండ్ – కారవాన్ విమానం బ్యాంకాక్ విమానాశ్రయం నుంచి ట్రాట్ ప్రావిన్స్ కు పర్యాటకులతో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విమానం చాచోంగ్‌సావోలోని అడవిలో కుప్పకూలినట్లు తెలుస్తోంది. విమానంలో ఏడుగురు టూరిస్టులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. అయితే ఈ ప్రమాదంలో గల్లంతైన వారి గురించి అధికారిక ప్రకటన రాలేదు. విమాన శకలాలు అడవిలో లభ్యమయ్యాయి.