నిర్ధేశించిన సమయంలో చట్టపరిధిలో అర్జీలు పరిష్కరించాలి..

Get real time updates directly on you device, subscribe now.

పోలీసు “పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం” కార్యక్రమంలో 30 అర్జీల స్వీకరణ..

నిర్ధేశించిన సమయంలో చట్టపరిధిలో అర్జీలు పరిష్కరించాలి..

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహా కిషోర్ ఐ.పీ.ఎస్..


ఆంధ్రప్రదేశ్ / తూర్పుగోదావరి జిల్లా/రాజమహేంద్రవరం అర్బన్ / హ్యూమన్ రైట్స్ టుడే /ఎక్స్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ ప్రతినిధి/19 ఆగష్టు:
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “ప్రజా సమస్యల పరిష్కార వేదిక “పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం” (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నిర్వహించి జిల్లా నలు మూలల నుండి వచ్చిన ప్రజల నుంచి వివిధ రకాల అర్జీలను స్వీకరించి, వారి కష్టాలను, బాధలను స్వయంగా అడిగి తెలుసుకుని, వెనువెంటనే నేరుగా సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదిదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయవలసినదిగా ఉత్తర్వులు ఇచ్చినారు.
సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గల సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటుగా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) శ్రీ ఎస్. ఆర్.రాజశేఖర్ రాజు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు.
సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అర్జీలకు నాణ్యతతో పాటు నిర్ధేశించిన సమయంలోపరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు అందించిన వినతులను పరిశీలించి నాణ్యతతో చట్ట పరిధిలో వాటినీ పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నేటి పోలీసు “పి.జి.ఆర్.ఎస్” కార్యక్రమానికి 30 ఫిర్యాదులు రాగా, వీటిలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యల గురించి, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు మరియు ఇతర కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించడమైనది.
ప్రజా సమస్యల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో అడిషనల్ ఎస్సీ (అడ్మిన్) ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు, ఇన్స్పెక్టర్(ఎస్.బి) సూరి అప్పారావు, సబ్ ఇన్స్పెక్టర్ అలీ ఖాన్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment