ఆంధ్రప్రదేశ్ /అమరావతి/ హ్యూమన్ రైట్స్ టుడే/19 ఆగష్టు/ఎక్స్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ ప్రతినిధి: ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఫైబర్ నెట్ కార్పోరేషన్ లో తన అవినీతిని కప్పి పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని జీవోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా ఆయన సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారని ప్రభుత్వం జీవోలో తెలిపింది. కేంద్ర సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించిన మధుసూదన్ రెడ్డి హెడ్ క్వార్టర్ ను విడిచి వెళ్లకూడదని స్పష్టం చేస్తూ జీవో విడుదల చేసింది. ఫైబర్ నెట్ లో అక్రమాలకు పాల్పడినట్లు మధుసూదన్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. సంస్థలో పెద్ద ఎత్తున బంధువులను నియమించి రూ. వందల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని పలువురు ఆయనపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని, నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల నియామకం చేశారంటూ ఫిర్యాదులో తెలిపారు. ఫైబర్ నెట్ కార్పోరేషనులో రూ. 800 కోట్ల మేర అవినీతి జరిగిందని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో మధుసూదన్ రెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కాగా మధుసూదన్ రెడ్డి 2008 బ్యాచ్ కి చెందిన ఐఆర్ఏఎస్ అధికారి.