హ్యూమన్ రైట్స్ టుడే/నల్గొండ: రైతు విమోచన చట్టం, విద్యుత్ సంస్కరణ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలో రైతు సంఘం ఆధ్వర్యంలో ట్రాక్టర్ల తో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలతో వ్యవసాయరంగం నిర్వీర్యమై రైతులు మరింత నష్టపోతారని తెలిపారు. పెట్టుబడిదారి, పారిశ్రామిక, కార్పొరేట్, భూస్వామివర్గాలకు లబ్ధి చేకూర్చేలా విధానాలను అనుసరిస్తూ, రైతులు, వ్యవసాయ కార్మికుల జీవనోపాధిని మోదీ ధ్వంసం చేస్తున్నారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఆరోపించారు. కౌలు రైతులను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యా ల సమయంలో నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు బడ్జెట్‌లో నిధులు, ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. కార్పొరేట్ సంస్థలకు కోట్ల రూపాయలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. కేంద్ర విధానాల వల్ల వ్యవసాయ రంగం, ఆధారిత రంగాలపై ఆధారపడ్డ మెజార్టీ ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.