ఫైళ్ళ దహనం ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా యంత్రాంగం..
విధుల్లో నిర్లక్ష్య వైఖరి ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేసిన కలెక్టర్ పి.ప్రశాంతి..
ఆంధ్రప్రదేశ్ / తూర్పుగోదావరి జిల్లా/ రాజమహేంద్రవరం రూరల్/ హ్యూమన్ రైట్స్ టుడే/19 ఆగష్టు: ఎక్స్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ ప్రతినిధి: పోలవరం ఎడమ కుడి కాలువ (ఎల్ ఎ) కార్యాలయం ఫైళ్ళ దహనం కేసులు భాగస్వామ్యం అయిన సీనియర్ అసిస్టెంట్ లు కే.నూకరాజు, కారం బేబి, స్పెషల్ రెవెన్యు ఇనస్పెక్టర్ కె.కళా జ్యోతి, ఆఫీసు సభార్డినేట్ కె.రాజశేఖర్ లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ పి ప్రశాంతి ఉత్తర్వులు జారీ.
డిప్యూటీ తహసీల్దార్ లు ఏ. కుమారి, ఏ.సత్యదేవి లకి షోకాజ్ నోటీసుల జారీ.
ధవలేశ్వరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన డిప్యూటీ కలెక్టర్ కె. వేదవల్లి, క్రైమ్ నెంబర్ 211/2024 ఎఫ్ ఐ ఆర్ నమోదు.