ఎన్టీఆర్ జిల్లాలో దారుణం.. ఇంటర్ విద్యార్థినిపై యువకుల అత్యాచారం..
హ్యూమన్ రైట్స్ టుడే/ఎన్టీఆర్ జిల్లా/క్రైం/ఆగస్టు 19:
ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్న పేట మండలం నూతిపాడు గ్రామానికి చెందిన మైనర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రెండు నెలలుగా ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన యువకుడు వేధింపులకు గురి చేస్తున్నాడు. యువకుడికి మరో ఇద్దరు యువకులు సహకరించినట్లు సమాచారం.
ఈనెల 10న స్నేహితులతో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని యువకులు బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందుతులపై ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.