ఆంధ్రప్రదేశ్ / అనకాపల్లి జిల్లా/ కోటవురట్ల మండలం/ హ్యూమన్ రైట్స్ టుడే/19 ఆగష్టు: కోటవురట్లలో మండలంలో కైలాస పట్నం వద్దగల పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ (pasa) అనాధాశ్రమంలో ఫుడ్ పాయిజన్ కావడంతో ముగ్గురు విద్యార్థుల మృతి చెందారు. 27 మందికి తీవ్రఅస్వస్థత. ఇద్దరు బాలురు ఒక బాలిక మృతి, శనివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనలో బాధిత విద్యార్థులు, నర్సీపట్నం, చింతపల్లి, డౌన్నూరు,ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తం ఈ ట్రస్ట్ లో 86 మంది అనాధ బాలికలు విద్యను అభ్యసించినట్లు తెలిసింది.
ఘటనపై విచారణ చేపట్టిన డిప్యూటీ డీఈవో పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ఆర్డీవో జయరాం మెరుగైన వైద్యం కోసం పలువురు విద్యార్థులను కేజీహెచ్‌కు తరలించిన అధికారులు ఘటనపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు దిగ్భ్రాంతి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం.