రుణమాఫీ కాలేదన్న రైతులకు సంకెళ్లు!
రుణమాఫీ కాలేదని శవ యాత్ర చేసిన 11 మంది రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు..
అరెస్ట్ చేయాల్సిందే అని ఒత్తిడి చేసిన ఓ మహిళా మంత్రి..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/19ఆగష్టు: కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ కాలేదని రెండు రోజుల క్రితం అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో రేవంత్ రెడ్డి శవ యాత్ర చేసిన రైతులు. ఈ ఉదంతం వల్ల కాంగ్రెస్ పరువు పోవడంతో వారి మీద కేసులు పెట్టాలని సీఎంకు సన్నిహితంగా ఉండే ఆ జిల్లాకు చెందిన ఇంఛార్జి మహిళా మంత్రి ఆదేశం.
ఈ శవ యాత్రలో పాల్గొన్న గోక లక్ష్మారెడ్డి, పుండ్రు ఉపేందర్ రెడ్డి, ఉరుకొండ దత్తు, నిమ్మల సూర్యసేన్ రెడ్డి, విపుల్ రెడ్డి, నక్క ధనుంజయ్, కుమ్మరి భూమన్న, బహద్దూర్ నర్సింహులు, అల్లూరి సతీష్ రెడ్డి, నిమ్మల సుదర్శన్ రెడ్డి, పుండ్రు పోతారెడ్డిలను అరెస్ట్ చేసిన పోలీసులు.