తమ రాజకీయ మనుగడ కాపాడుకొనేటందుకు పడ్తున్న పాట్లును చూసి జాలి వేస్తుంది – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/19 ఆగష్టు: గత నాలుగు రోజులనుండి రాష్ట్రములో ప్రతిపక్ష నేతలు అనేక విన్యాసాలు చేస్తూ, సోషల్ మీడియా సాక్షిగా, రైతాంగాన్ని తమ అసత్య ప్రచారాలతో ఆందోళనకు గురి చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి అమలు చేస్తున్న పథకాలతో ప్రజల్లో పార్టీ పట్ల పెరుగుతున్న నమ్మకం చూసి, తమ రాజకీయ మనుగడ కాపాడుకొనేటందుకు పడ్తున్న పాట్లును చూసి జాలి వేస్తుంది – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
ఒకరేమో లక్ష మాఫీ చేయడానికే ఆపసోపాలు పడి, చివరికి సగం మందికి కూడా చెయ్యలేక రైతుల నమ్మకం కోల్పోయిన వారు, ఇంకొకరు తాము అధికారంలో ఉన్న ఏ ఇతర రాష్ట్రంలోను ఇప్పటిదాకా రుణమాఫీ పధకం ఆలోచనే చెయ్యని వారు వీరిద్దరూ కాంగ్రెస్
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి పంటలోపే 2 లక్షల వరకు రుణ మాఫీ చేసి, ఇంకా ప్రక్రియ కొనసాగుతుండగానే, ఎటూ పాలుపోక కాంగ్రెస్డ్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
బ్యాంక్స్ నుండి అందిన ప్రతి ఖాతాదారునికి వారి అర్హత బట్టి మాఫీ చేసే బాధ్యత మా ప్రభుతానిది- మంత్రి తుమ్మల
ఇప్పటికి కేవలం రెండు లక్షల వరకు కుటుంబ నిర్దారణ జరిగిన ఖాతాదారులందరికి పధకాన్ని వర్తింపచేసాం.
2 లక్షల లోపు మిగిలి ఉన్న ఖాతాలకు కుటుంబ నిర్ధారణ చేసి వారికి కూడా చెల్లిస్తాం.
2 లక్షల పైన ఉన్న ఖాతాలకు, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వారు ముందు 2 లక్షల కంటే అదనంగా పొందిన రుణాన్ని చెల్లించిన పిదప, అర్హత బట్టి చెల్లిస్తాము.
బ్యాంకర్లు నుండి వచ్చిన డేటా తప్పుగా వివరాలు ఉన్న రైతుల వివరాలును కూడా రైతుల వద్ద నుండి సేకరిస్తున్నాము.
రుణ మాఫీ పొందిన రైతులకు తిరిగి కొత్త రుణాలు మంజూరు చేయాల్సిందిగా బ్యాంకర్స్ను కోరాము.
అందరికి సమాచారం కోసం గత ప్రభుత్వ నిర్వకాలు ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా రుణమాఫీ వివరాలు మీకు అందిస్తున్నాము.
కనీసం గత ప్రభుత్వ పెద్దలు తాము అధికారంలో వున్నప్పుడు అరకొరగా అమలు చేసిన రుణమాఫీతో ప్రయోజనం ఏ మేరకు జరిగిందో ఆత్మ పరిశీలన చేసుకొని, ఇకనైనా హుందాగా ప్రవర్తించి, ప్రజల్లో తమ స్థాయిని కాపాడుకొంటారని ఆశిస్తున్నా అన్నారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి, 31000 కోట్లు నిధులు కేటాయించుకొని, గత ప్రభుత్వ పెద్దల నిర్వాకంతో చిన్నాభిన్నం చేసిన ఆర్థిక పరిస్థితులలోను, ఆగస్ట్ 15 లోపు, 18000 కోట్లతో 2 లక్షల లోపు రుణ మాఫీ చేసిన ప్రభుత్వంతో సవాళ్ళా?