జమ్మూ కాశ్మీర్ జవానులకు రాఖీలు కట్టిన బాలికలు..జై జవాన్..
హ్యూమన్ రైట్స్ టుడే/డెస్క్/ఆగష్టు 19: దేశంలో నిన్న అడివరంరోజునే రాఖీ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. సరిహద్దు గ్రామాల ప్రజలు జవాన్లతో కలిసి రాఖీసంబురాలు జరుపుకుంటున్నారు. జవాన్లకు రాఖీలు కట్టి స్వీట్లు పంచుతున్నారు.
జమ్ముకశ్మీర్‌లోని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులో కూడా రాఖీ సంబరాలు జరిగాయి. సుచేత్‌గఢ్ ఏరియాలోని సరిహద్దు గ్రామాలకు చెందిన బాలికలు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) జవాన్లకు రాఖీలు కట్టారు. వారితో జవాన్లు సంతోషంగా రాఖీలు కట్టించుకున్నారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు.