అమెరికా నుండి అతిథిగా బోర్గం పి లో విగ్రహాన్ని ఆవిష్కరించిన అంతర్జాతీయ న్యాయవాది కావేటి…
ఏకపక్షంగా కులవివక్ష చూపిన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు…
హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని ఐదవ డివిజన్ బోర్గo పి లో ఎట్టకేలకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం గణతంత్ర దినోత్సవం రోజున ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బడుగు బహీనవర్గాలకు చెందిన ప్రజలు, పలు ప్రజా సంఘాల నాయకులు, వక్తలు పెద్దఎత్తున హజరుకాగ అంతర్జాతీయ న్యాయవాది డాక్టర్ కావేటి శ్రీనివాస్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి సభద్యక్షులుగా ఉన్న చిలుక శ్రీనివాస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కృషి వల్లనే ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకంటున్నాం. కానీ ఈ విగ్రహ నిర్మాణానికి సంకల్పించిన నాటి నుండి నేటి ఆవిష్కరణ వరకు అన్ని కుల గజ్జి రాజకీయాలు, వివక్ష, వ్యతిరేకత లు, బహిష్కరణ లు ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పాలకులు స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ రాజేశ్వర్, పోలీస్ కమిషనర్, ఆర్డీఓ, ఏసిపి లు కూడా ఏకపక్ష రాజకీయ వివక్ష చూపించారు. దానికి నిదర్శనం ఈరోజు ఇక్కడికి రావద్దు వెళ్లొద్దు అని చెప్పడంతో చెప్పడంతో ఏ ఒక్కరూ కూడా రాలేదు. ఇక్కడి వరకు వచ్చి కార్యక్రమానికి రాకపోవడం అంటే ఇంకా మనం ఎక్కడున్నము అన్నారు. మనం వేసే ఓట్ల కోసం వచ్చినప్పుడు ఈ కులాలు వివక్ష ఉండదు. ఇప్పుడు ఆలోచించండి ఇంటి ముందుకు ఏ ప్రజా ప్రతినిధులను రానివ్వకుడదు అని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కావేటి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోజు ప్రోటోకాల్ ప్రకారం వస్తాము అని చెప్పి ఈరోజు ఈ మహనీయుని విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం లో రాజకీయ వివక్ష చూపించడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. వారు అధికారాలు పదవులు అన్ని కూడా ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం వచ్చినవే అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ వక్తలు అప్పల ప్రసాద్, రాజు, వినోద్ కుమార్, సిద్దిరాములు, కార్పొరేటర్ రాజశేఖర్, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు నిర్వహకులు గుండు బ్రహ్మయ, చిలుక రమేష్, గంగానర్శయ్య, ప్రభాకర్, బాబు జై భీం నగర్ కాలనీ వాసులు, ప్రజలు కళ బృందాల సభ్యులు పాల్గొన్నారు.