కొనసాగుతున్న ఆపరేషన్ హైడ్రా.. ఎక్కడంటే?
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఆగష్టు 19: నగరంలో సంచలనం రేపుతున్న హైద్రా ఆపరేషన్ కొనసాగుతోంది. ఆదివారం నగర శివారు ప్రాంతాల్లో ఆపరేషన్ కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా గండిపేట్ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో నిర్మించిన భారీ భవనాలు, చెరువులో నిర్మించిన అపార్ట్‌మెంట్లను నేలమట్టం చేశారు. హైడ్రా కమీషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదులు రావడంతో హైడ్రా బృందం రంగంలోకి దిగింది. పటిష్ట బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూల్చివేతలను అడ్డుకున్న స్థానికులను అధికారులు అరెస్ట్ చేశారు.
కొనసాగుతున్న ఆపరేషన్ గండిపేట..
నగరంలోని గండిపేట చెరువు చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ చేసింది. 5 రోజుల్లో ఆపరేషన్ గండిపేట పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గండిపేట చెరువు బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేస్తున్నారు. మరోవైపు చిలుకూరు, నార్సింగ్ మండలం ఖానాపూర్‌లలో భారీ భవనాలను కూడా కూల్చివేయనున్నారు.