హైదరాబాద్ లో మరోసారి బయటపడ్డ ఉగ్రమూకలు..
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ కు చెందిన ఉగ్రవాది రిజ్వాన్ కు షెల్టర్..
ఆరు నెలలు సికింద్రాబాద్ లో రిజ్వాన్..
ఇటీవల అరెస్ట్ చేసిన పోలీసులు..
విచారణలో సంచలన విషయాలు..
దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా దాని మూలాలు హైదరాబాద్ తో ముడిపడి ఉంటున్నాయ..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/క్రైం/18 ఆగష్టు: హైదరాబాద్ లో మరోసారి ఉగ్రవాద మూలాలు బయటపడ్డాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ కు చెందిన ఉగ్రవాది రిజ్వాన్ అలీని ఢిల్లీ స్పేషల్ సెల్ పోలీసులు ఫరిదాబాద్ సరిహద్దులో ఎన్ఐఏ అరెస్ట్ చేశారు. న్యాయస్థానం అనుమతితో కస్టడిలోకి తీసుకున్న పోలీసులకు విచారణ చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిజ్వాన్ అలీ యువతను ఉగ్రవాదంవైపు మళ్లించడంలో దిట్ట. సుమారు ఏడాది కాలంగా పరారీలో ఉన్న ఇతడిపై ఎన్ఐఏ రూ. 3 లక్షల రివార్డు ప్రకటించింది. రిజ్వాన్ కేరళతో పాటు హైదరాబాద్ లోనూ తలదాచుకున్నట్లు విచారణలో తేలింది. నగరానికి చెందిన ఘోరీతో రిజ్వాన్ నిత్యం సంప్రదింపులు జరిపినట్లు తేటతెల్లమైంది. రాష్ట్ర నిఘా విభాగానికి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ నుంచి ఓ ప్రత్యేక బృందం హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లింది.