భర్తతో కలిసి మద్యం తాగి.. అతడిని కొట్టి అఘాయిత్యం..

Get real time updates directly on you device, subscribe now.

ఏలూరు జిల్లా : ఏలూరు 1 టౌన్ :

*వివాహితపై సామూహిక అత్యాచారం*

*భర్తతో కలిసి మద్యం తాగి.. అతడిని కొట్టి అఘాయిత్యం..‼️*
హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/ఏలూరు/18 ఆగష్టు:
భర్తతో కలిసి మద్యం తాగిన కొందరు యువకులు.. తర్వాత అతన్ని కొట్టి భార్యపై సామూహిక అత్యాచారం చేశారు. ఏలూరులో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. మూడు పోలీసుస్టేషన్లకు కూతవేటు దూరంలో ఈ దారుణం జరిగింది.                  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..                       

పెదవేగి మండలం విజయరాయికి చెందిన వ్యక్తి, అతని రెండోభార్య ఏలూరు వన్టైన్ రామకోటి ప్రాంతంలో ఉంటున్నారు. 15రోజుల క్రితం నగరానికొచ్చిన వీరు పగలు హోటల్లో పనిచేస్తుంటారు. రాత్రిళ్లు రామకోటిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ హించే స్టేజీ అరుగులపై విశ్రమిస్తారు. అద్దె ఇల్లు దొరి కితే వెళదామని అనుకుంటున్నారు. నగరానికి చెందిన ముగ్గురు యువకులు వారికి పరిచయమయ్యారు. వారు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జులాయిగా తిరుగుతుంటారు. శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురు యువకులు, విజయరాయి వ్యక్తి కలిసి మద్యం తాగారు. ఆ పక్కనే అతని భార్య నిద్రిస్తోంది. మద్యం మత్తు ఎక్కాక . ముగ్గురు యువకులు అతనిపై దాడి చేశారు. అనంతరం పక్కనే నిద్రిస్తున్న అతని భార్యను కొద్ది దూరం లాక్కెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం ఆమె ముఖంపై దాడి చేశారు. ఈ అఘాయిత్యాన్ని అడ్డుకోలేని భర్త కేకలు వేస్తూ పక్కనే ఉన్న రోడ్డుపైకి వచ్చి అటుగా వెళ్తున్న యువకుడికి విషయం చెప్పి రక్షించాలని కోరాడు. ఆ యువకుడు స్పందించి ఘటనా స్థలానికి వస్తుండగా నిందితులు ముగ్గురూ పరారయ్యారు.

*100కు కాల్ చేసినా స్పందించలేదు*

డయల్ 100కు కాల్ చేసినా సరిగా స్పందించలేదని అక్కడికొచ్చిన యువకుడు చెబుతున్నారు. 100కు కాల్ చేసి చెప్పగా చూస్తాం.. ఎక్కడ అంటూ ముభా వంగా మాట్లాడారని, సరిగా స్పందించలేదన్నారు. తర్వాత సమీపంలోని వన్లైన్ పోలీసుస్టేషన్కు వెళ్లి విషయం చెప్పగా పది నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చినట్లు చెప్పారు.

*నిందితుల అరెస్టు… 14 రోజుల రిమాండ్*                

అత్యాచారం ఘటనలో నిందితులు ముగ్గురినీ ఏలూరు వన్హన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. చెంచుల కాలనీకి చెందిన నూతిపల్లి పవన్, లంబాడీపేటకు చెందిన నారపాటి నాగేంద్ర, మరడాని రంగారావు కాలనీకి చెందిన గడ్డి విజయ్కుమార్ అలి యాస్ నానిలను వన్డేన్ ఎస్సై లక్ష్మణ్బాబు, సిబ్బంది అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment