హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/18 ఆగష్టు: కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన మేరకు ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల రుణ సాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ తో కలిసి ఆ మొత్తాన్ని మంజూరు చేయనున్నట్లు సమాచారం. ఆయా బ్యాంకుల ప్రతినిధులు రేపటి నుంచి ఈ నెల 27 వరకు రాజధానిలో పర్యటించి వివిధ అంశాలపై ప్రభుత్వంతో చర్చించనున్నారు. వీలైనంత త్వరలోనే రుణం మంజూరు చేసే అవకాశముంది.