హ్యూమన్ రైట్స్ టుడే/డెస్క్/18 ఆగష్టు: ఆర్ జి కర్ మెడికల్ కాలేజీలో డాక్టర్ హత్యాచారంపై నిరసనలో పాల్గొని తిరిగి వస్తుండగా ఒక బాలికపై అత్యాచారం హత్య జరిగినట్లు వచ్చిన వార్తలను పోలీసులు ఖండించారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా బర్ధమాన్ పోలీసులు మాట్లాడడుతూ “బుర్ద్వాన్‌లో అలాంటి అత్యాచార ఘటనేమీ జరగలేదు. ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం” అని తెలిపారు. కాగా, బెంగాల్‌లో ఆగస్టు 14న డాక్టర్‌పై హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే.