హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/18 ఆగష్టు: మహారాష్ట్రలోని థానె జిల్లా భివాండి ప్రాంతంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. అనిల్ అనే వ్యక్తికి, 26 ఏళ్ల మహిళకు పరిచయం ఉంది. అయితే మద్యం తాగిన మత్తులో మహిళ ఇంటికి అనిల్ వెళ్లాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో కిచెన్‌లోని గరిటెతో అనిల్‌పై ఆ మహిళ దాడి చేసింది. నిందితుడి ప్రైవేట్ పార్ట్స్‌పై గరిటెతో పలుమార్లు గట్టిగా కొట్టింది. తీవ్ర గాయాలతో బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.